మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం లీన్ లుక్‌లోకి మారిపోయాడు. అయితే ఎన్టీఆర్‌ను అలా చూడటం ఇష్టంలేని చాలామంది తారక్‌కు ఏదో అయిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంకొంతమంది.. తారక్ సినిమాల్లో వచ్చిన కొత్తల్లో ఉన్నట్లుగా చబ్బీగా ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఎన్టీఆర్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్… ‘నాపై చేతబడి వంటిదేమీ జరగలేదు. పిచ్చి పిచ్చి ప్రచారాలు ఆపండి’ అని వార్నింగ్ ఇవ్వటం కనిపిస్తోంది. నెటిజన్లు మాత్రం ఆ పాయింటునే పట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాతి వీడియో అది. ప్రమాదంపై పలు పుకార్లు వ్యాపించటంతో ఆ ప్రమాదం ఎలా జరిగిందో.. అప్పట్లో రిలీజైన ఆ వీడియోలో తారక్ వివరించాడు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తాను, తన స్నేహితులు తాగి వాహనం నడపలేదని తారక్ చెప్పాడు. అలాగే ఇది ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగిన యాక్సిడెంట్ కాదన్నాడు. కొంతమంది నిజం తెలియకుండా మాట్లాడటంపై అప్పట్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.