బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ హిస్టారికల్ చిత్రం తానాజీ విడుదలై ఆరేళ్లు పూర్తయింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హీరో అజయ్ దేవగన్ ఒక ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు. సినిమా స్టిల్స్ షేర్ చేస్తూ “కథ ఇంకా ముగిసిపోలేదు” అని వ్యాఖ్యానించారు. అజయ్ దేవగన్ చేసిన ఈ ప్రకటనతో తానాజీ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందా అనే చర్చ మొదలైంది. మొదటి భాగంలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన విలన్ ఉదయ్‌భాన్ సింగ్ రాథోడ్ క్లైమాక్స్‌లో మరణించినట్లు చూపించారు. అలాగే, తానాజీ ఒక చేయిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీక్వెల్లో అజయ్ దేవగన్ పాత్ర ఎలా ఉంటుందనే సందేహాలు తలెత్తుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ మళ్లీ కనిపిస్తారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :