స్వీయ అనుభవం గొప్ప గుణపాఠం అని చెప్పడంలో సందేహం లేదు. టాలీవుడ్ హీరోల విషయంలో ఇది ప్రస్తుతం నిజమవుతోంది. వరుస పరాజయాలు వారి కెరీర్ లో కీలక మార్పులకు దారితీశాయి. కొందరు నటులు కొత్తదనం కోసం ఈ మార్పును కోరుకుంటే, మరికొందరు ఫ్లాప్ల భయంతో తమ అడుగులను మార్చుకుంటున్నారు. డీజే టిల్లుతో స్టార్ బాయ్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ, ఆ తర్వాత జాక్, తెలుసు కదా చిత్రాలతో నిరాశపరిచాడు. దీంతో తన కెరీర్ మొదట్లో సక్సెస్ ఇచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్జె స్వరూప్ తో సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకు సిద్ధమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :