ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో


రోజూలాగే గురువారం ఉదయం రాకేష్‌ బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి భార్య మాయ.. ఫోన్ మాట్లాడుతూ లీనమైపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాకేష్.. ఆమెను మందలించాడు.. మాట మాట పెరిగింది. దీంతో.. మాయ తలను గోడకేసి కొట్టాడు రాకేష్. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్తో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు.. పక్కనే ఉన్న 4నెలల చిన్నారిని స్థానికుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మాయపై అనుమానంతోనే ఆమెను హత్య చేశాడని ఎలమంచిలి సిఐ ధనుంజయ తెలిపారు. తల్లిని కోల్పోవడంతో ఆ చిన్నారిని సంరక్షిస్తున్నారు నర్సులు, ఐసిడిఎస్ సిబ్బంది. తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారికి పాలు పట్టి సపర్యలు చేశారు. మాయకు ఇంకో 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆ బాలిక తన మొదటి భర్త సంతానం. ఆమె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడీ ఘటనతో ఆ చిన్నారుల భవిష్యత్తు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో



Source link

Leave a Comment