డిసెంబర్ ఒకటో తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టింది సమంత. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్ గా కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో రెండో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించని సమంత, తాజాగా భర్త రాజ్ నిడిమోరు తో మెరిసింది. ముంబై నుంచి వచ్చిన సమంతకు శంషాబాద్ విమానాశ్రయంలో వెల్‌కమ్ చెప్పారు రాజ్. రాజ్ కారు డ్రైవ్ చేస్తుండగా సమంత అతని పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, నిర్మాతగా కొనసాగుతున్నారు. ట్రాలాలా పతాకంపై సమంత నిర్మాతగా ‘మా ఇంటి బంగారం’ రూపొందుతోంది. ‘ఓ బేబీ’ విజయం తర్వాత నందిని రెడ్డి- సమంత కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్ కథలో సమంత మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనుంది. మా ఇంటి బంగారంలో తమ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కామెంట్ చేసారు. సమంత నిర్మాత అయినప్పటికీ సెట్‌లో ఎప్పుడూ నటిగానే వ్యవహరిస్తుందనీ సమంతతో వర్క్ చేయడం చాలా ఈజీ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :