2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో


గత ఏడాదిలో జరిగిన పరిణామాలను పక్కన పెట్టి, 2026లో సినీ ప్రియులను అలరించడానికి అక్కినేని కుటుంబ హీరోలు సిద్ధమవుతున్నారు. నాగార్జున, అఖిల్, నాగచైతన్యలు విభిన్నమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ఫామ్‌లో ఉండగా, అఖిల్, నాగార్జునలు భారీ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు. నాగచైతన్య తండేల్ విజయం తర్వాత, ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌తో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నారు. ఈ చిత్రం కోసం చైతూ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. దర్శకుడు కార్తీక్ దండు గతంలో విరూపాక్షతో విజయం సాధించిన అనుభవం ఉంది. నాగార్జున తన కెరీర్‌లో 100వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ రూపొందించనున్న ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇది నాగార్జున ఇంతవరకు చేయని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో



Source link

Leave a Comment