Actress Prathyusha : నా బిడ్డకు నిజమైన న్యాయం దక్కలేదు.. తన ఆత్మకు శాంతి కలగలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..


టాలీవుడ్ దివంగత హీరోయిన్ ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడైంది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్దించిన సుప్రీం కోర్టు.. సిద్దార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని స్పష్టం చేసింది. ప్రత్యూష కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె పోస్టూమార్టం నిర్వహించిన పద్దతి సరిగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ప్రత్యూష తల్లి సరోజిని దేవి మీడియాతో మాట్లాడుతూ తన బిడ్డకు నిజమైన న్యాయం దక్కలేదని అన్నారు. “హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడున్నా వచ్చి లొంగిపోవాలని.. రెండున్నరేళ్లని ఖరారు చేశారని అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాను. కానీ నాకు ఇంకా సరైన న్యాయం జరగలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నా కూతురిపై అత్యాచారం జరిగిందని.. తనను చంపేశారని నేను నమ్ముతున్నాను.. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎవరు ఏం చెప్పినా ఈ రెండింటి గురించి వేరేది నమ్మే పరిస్థితిలో లేను. నా బిడ్డకు నిజమైన న్యాయం దక్కలేదు. సిద్దార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని ముందు నుంచి పోరాటం చేస్తున్నాను. నాది సుప్రీంకోర్టులో 14 ఏళ్ల పోరాటం.. 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాను” అని అన్నారు. హైకోర్టులో ఇచ్చిన రెండున్నరేళ్ల శిక్షను.. ఇక్కడ రెట్టింపు చేస్తారని భావించాను. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నా బిడ్డకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. ఆమె ఆత్మకు శాంతి కలగలేదని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రత్యూష.. తన ఇంటర్ క్లాస్ మేట్ సిద్ధార్థ్ రెడ్డిని ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. సిద్ధార్థ్ ఇంజనీరింగ్ లో చేరాడు. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30 -8 గంటల మధ్య ఇద్దరూ విషయం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న మరణించగా.. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వీరిద్దరు కూల్ డ్రింగ్ లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. సిద్ధార్థ్ రెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. అతడికి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 2004లో ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత అతడు హైకోర్టును ఆశ్రయించగా.. జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ప్రత్యూష తల్లి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.



ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..



Source link

Leave a Comment