మిథునం: కొత్త సంవత్సరంలో జూన్ మొదటి వారం నుంచి గురువు ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి ‘వద్దంటే డబ్బు’ అన్నట్టుగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి ఇబ్బడిముబ్బడిగా లాభిస్తాయి. కష్టనష్టాల నుంచి బయటపడడం, సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది. అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది.