యశ్ కథానాయకుడిగా నటిస్తున్న టాక్సిక్ చిత్రంపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న యశ్, తన తదుపరి చిత్రం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సిక్ విషయంలో రీషూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అవుట్‌పుట్‌పై యశ్ అసంతృప్తిగా ఉన్నారని, చాలావరకు సీన్స్‌ను తిరిగి చిత్రీకరించాలని దర్శకురాలికి సూచించారని వార్తలు వచ్చాయి. అయితే, అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ, టాక్సిక్ చిత్రం 2026 మార్చి 19న విడుదల కావడం ఖాయమని చిత్ర బృందం స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు