ఈ క్రమంలోనే అభిమానుల ప్రవర్తన, భద్రతా లోపాలపై దృష్టి సారించిన పోలీసులు, ఈవెంట్ నిర్వాహకులతో సహా.. మాల్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా, బాధితురాలు నిధి అగర్వాల్‌ను సంప్రదించిన పోలీసులు, ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన అభిమానులపై ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే, పోలీసుల విజ్ఞప్తికి నిధి అగర్వాల్ విముఖత వ్యక్తం చేశారు. ‘తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయదలచుకోలేదని’ ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు చేసేదేమీ లేక వెనుతిరిగారు. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :