శీతాకాలంలో లభించే సీజనల్ పండ్లలో జామపండ్లు ముందు వరుసలో ఉంటాయి. ఇవి రుచికి మాత్రమేకాదు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో జామపండు సహజంగా పండి తాజాగా ఉంటాయి. దీంతో ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది.