ట్రిపుల్ ఆర్ విజయవంతం అయిన తర్వాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఆయన తదుపరి చిత్రం వారణాసి 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ విరామం వల్ల ప్రేక్షకులు రాజమౌళి మార్క్ విజువల్స్ ను మిస్ కాకుండా ఉండేందుకు ఆయన ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవలే బాహుబలి సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రీ-రిలీజ్ చేసి సాంకేతికంగానూ అప్‌గ్రేడ్ చేశారు. ఇది ఘన విజయం సాధించడంతో, ఇప్పుడు మరో రాజమౌళి క్లాసిక్‌ను రీ-రిలీజ్ చేయడానికి ఆయన బృందం సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :