Actress: రెండేళ్ల క్రితం ప్రియుడితో వివాహం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్


పలు తెలుగు సినిమాల్లో నటించిన పూజా ఝావేరి గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల క్రితం ప్రియుడిత కలిసి పెళ్లి పీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. ఈ శుభవార్తను స్వయంగా పూజనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గుజరాత్ లోనే పుట్టి పెరిగింది పూజా ఝావేరి. అక్కడే చదువుకుంది కూడా. అయితే సినిమాలపై ఆసక్తితో సొంతూరిని వదిలేసి ముంబైకు వచ్చేసింది. ఇక 2015లో ‘భమ్ భోళేనాథ్’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైందీ అందాల తార. ఆ తర్వాత రౌడీబాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ద్వారక’, సుమంత్ అశ్విన్ ‘రైట్ రైట్’, రవితేజ ‘టచ్ చేసి చూడు’,47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు, మిక్స్ అప్ తదితర తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసింది. అందం, అభినయం పరంగా ఒకే అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోయింది. ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. చివరిగా గతేడాది వందే భారత్ వయా యూఎస్ ఏ అనే ఓ గుజరాతీ సినిమాలో యాక్ట్ చేసింది పూజ.

సినిమాల సంగతి పక్కన పెడితే.. 2024లో ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుంది పూజా జవేరి. అప్పుడే తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోయింది. ప్రస్తుతం న్యూయార్క్‌లోనే నివాస ముంటోందీ అందాల తార. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. తన భర్త, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. నెటిజన్ల నుంచి లైక్స్ ,కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

భర్తతో పూజా ఝావేరి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Comment