యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్
తిరువీర్ మాట్లాడుతూ.. నటుడిగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మనతో సినిమా చేసిన నిర్మాత బాగుండాలి, దర్శకుడికి మంచి పేరు రావాలి, ప్రేక్షకులు ప్రతి సినిమాను ఆదరించాలని కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఈ ఏడాది నా నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఇంకా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు నా సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇకపై కూడా నా ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నాను. మన కో-స్టార్స్ మంచి పెర్ఫార్మర్స్ అయితే మనం కూడా ఇంకా బాగా నటించడానికి ప్రయత్నిస్తాం. ఒక నటుడికి ఎదుటి నటుడి రియాక్షన్‌ను బట్టి కూడా నటించే అవకాశం పెరుగుతుంది. ఆ విషయంలో ఐశ్వర్య రాజేష్ గారు, నిత్యా మీనన్ గారు లాంటి మంచి నటీమణులతో పనిచేయడం ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. వాళ్లతో కలిసి పనిచేసినప్పుడు మన నటన కూడా మరింత మెరుగవుతుంది.
ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు
ఇంతకుముందు ఐశ్వర్య గారితో ‘టక్ జగదీష్’ సినిమాలో పనిచేశాను. కానీ హీరో, హీరోయిన్గా కలిసి నటించడం మాత్రం ఈ సినిమాతోనే జరిగింది. ఈ సినిమాలో పనిచేసిన చాలామందితో గతంలోనే కలిసి పనిచేయడం వల్ల సెట్లో చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఐశ్వర్య గారితో సీన్స్ చేసేటప్పుడు చాలా విషయాలు చర్చించేవాళ్లం. ఆమె తన అనుభవాలను నాతో పంచుకునేవారు. అది నాకు చాలా ఉపయోగపడింది. మా దర్శకుడు భరత్ దర్శన్ గారు సిద్ధిపేటకు చెందినవారు. ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తమ ప్రాంతాల కథలు, పాత్రలను చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారు. నటుడిగా నాకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు… ఇలా అన్ని ప్రాంతాల యాసల్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని
‘ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది.? ఆమె ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా.? అనేదే కథ. చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఇది ఒక అరుదైన పరిస్థితి ఆధారంగా రూపొందించిన కథ. ఇందులోని కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంత నవ్విస్తుందో, అంతే భావోద్వేగానికి గురి చేస్తుంది. మంచి హ్యూమర్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ప్రేక్షకులను కదిలిస్తాయి. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా అందరికీ నచ్చుతుంది. అలాగే నేను ఎక్కడికి వెళ్లినా చాలామంది “మీ సినిమాలు బాగుంటాయి” అని చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు నేను చేసిన పాత్రల గురించి మాట్లాడుతుంటారు. మహిళలకు సినిమా నచ్చితే కుటుంబమంతా చూస్తుంది. ఆ లెక్కన నేను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యానని భావిస్తున్నాను. ‘ఓ.! సుకుమారి’తో మరింత దగ్గరవుతానని నమ్ముతున్నాను. చాలా ఇళ్లలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ‘మసూద’, ‘ఫ్రీ వెడ్డింగ్’ లాంటి సినిమాలు పెట్టమని అడుగుతుంటారని చెబుతుంటారు. అలాగే ‘ఓ.! సుకుమారి’ కూడా అందరికీ ఇష్టమైన సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకుకొచ్చాడు తిరువీరు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి