Cinema : ఏం కాన్సెప్ట్ రా బాబూ.. 5 ఏళ్లుగా ఓటీటీలో గత్తరలేపుతున్న హారర్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ చూస్తే మెంటలెక్కిపోతుంది..


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చి ఓటీటీ వేదికగా సెన్సేషన్ సృష్టించిన బెస్ట్ హార్రర్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘మా ఊరి పొలిమేర’ ఒకటి. కేవలం 1 గంటా 36 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా, ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుండి పక్కకు తిప్పుకోకుండా చేయడంలో వంద శాతం విజయం సాధించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ IMDbలో ఈ చిత్రానికి ఏకంగా 7.1 రేటింగ్ లభించడం దీని పాపులారిటీకి అద్దం పడుతోంది. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, సత్యం రాజేశ్ కీలకపాత్రలు పోషించారు. 2021లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

ఈ సినిమా కథాంశం మొత్తం తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరిలో ఒక సాధారణ ఆటో డ్రైవర్ తన భార్యాపిల్లలతో ఎంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అతని ప్రాణస్నేహితుడి కుటుంబం కూడా పక్కనే ఉంటుంది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, ఆ గ్రామంలో వరుసగా జరిగే కొన్ని అనుమానాస్పద మరణాలు తీవ్ర కలకలం రేపుతాయి. మొదట గ్రామ ప్రెసిడెంట్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆ తర్వాత మరో ఇద్దరు వింత పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతారు. దాంతో ఊరి ప్రజల్లో భయాందోళనలు మొదలవుతాయి. అదే సమయంలో ఒక యువతి అనారోగ్యంతో మృతి చెందడం, ఆమె మృతదేహం వద్ద ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట రహస్యంగా క్షుద్రపూజలు, చేతబడి చేస్తూ పట్టుబడటంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు ఆ గ్రామంలో జరుగుతున్న వరుస మరణాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? గ్రామస్తులు నమ్ముతున్నట్టుగా చేతబడి నిజంగానే జరుగుతుందా? వీటన్నింటికీ ఆ ఆటో డ్రైవర్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

దర్శకుడు గ్రామీణ నేటివిటీని ప్రతిబింబిస్తూ, క్షుద్రపూజలు, మూఢనమ్మకాల చుట్టూ కథను అద్భుతంగా అల్లాడు. ముఖ్యంగా సినిమా చివరలో వచ్చే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ కూడా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ అద్భుతమైన హార్రర్ థ్రిల్లర్ మొదటి భాగం ‘ఆహా’ (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ పార్ట్ మాత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..



Source link

Leave a Comment