AP News: చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు | Mother, Daughter Killed in Road Accident While Returning Home After Church Prayers


AP News: నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోనవరం గ్రామంలో విషాదం నెలకొంది. చర్చిలో ప్రార్థనలు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తూ తల్లి కూతురు అనంతలోకాలకు చేరారు. ఈ హృదయ విదారక ఘటన నంద్యాల మండలం బ్రాహ్మణపల్లె మద్దూరు గ్రామాల మధ్య చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాణ్యం మండలం గోనవరం గ్రామానికి చెందిన లలితమ్మ లక్ష్మి తల్లి కూతురు నంద్యాలలోనే ఓ చర్చిలో ప్రార్థనలు ఉంటే వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు.

గ్రామానికి వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి వీరికి బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. బ్రాహ్మణ పల్లె, మద్దూరు గ్రామాల మధ్య వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుర్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్, పరారైన బైక్ రైడర్ ను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాలనుచి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గోనవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి



Accident

Accident

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Comment