ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా | Dharmendra pradhan resigns


కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా
విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా



సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు.
Vis.. (Troll Tweets)
నీట్‌ లీక్స్‌, ఆతర్వాత 21 మంది విద్యార్థుల మృతిపై కాక్రోచ్‌ జనతా పార్టీ రెండు నెలలుగా జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నాకు దిగింది. అయితే వారికి మద్దతుగా నిలిచిన సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌.. ఆమరణ దీక్షకు దిగుతున్నానని ప్రకటించారు. సరిగ్గా 21 రోజుల తర్వాత ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆ తర్వాత కూడా దీక్షను కొనసాగించారు. మరోవైపు సీజేపీ తోపాటు.. సోనం వాంగ్‌చుక్‌ అడుగుతున్న డిమాండ్లలో రెండింటికి కేంద్రం ఒప్పుకుంది. ఒక్కటి మాత్రం వదిలేసింది. అదే ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా. ఈ విషయంలో అప్పటివరకు గట్టిగా పట్టుబట్టిన సోనం వాంగ్‌చుక్‌.. మెత్తబడ్డారు. మిగిలిన డిమాండ్లకు కేంద్రం ఒకే చెప్పడంతో 26 రోజుల దీక్షను ముగించారు.



Source link

Leave a Comment