Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు! | Viral Lion Encounter: 12 Lions Block Highway in Gir Somnath, Amazes Drivers


సాధారణంగా సింహం పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. అలాంటి ఆ సింహమే నేరుగా మనకు ఎదరైతే.. అది కూడా ఒకటి కాదు.. ఏకంగా ఒక సింహాల గుంపే మన కారు ముందు వచ్చి ఆగితే.. ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా.. అచ్చం అలాంటి సీనే ఓ హైవేపై వెలుగు చూసింది. కార్లో వెళ్తున్న ఓ ఫ్యామిలీకి ఏకంగా 12 సింహాల గుంపు ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలోని జాంవాలా-మాధుపూర్ హైవేపై వెలుగు చూసింది. చల్లటి వాతావరణం కారణంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోని నుంచి ఒక్కసారిగా 12 సింహాల గుంపు రోడ్డుపైకి రావడంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ గుంపులో ఆడ సింహాలు వాటి పిల్లలతో కలిసి రోడ్డుపై శికారు చేస్తూ కనిపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన వాహనదారులు, ఓ వైపు భయం, మరోవైపు ఆశ్చర్యంతో కాసేపు నివ్వెరపోయారు. వాటిని డిస్ట్రబ్ చేయకుండా దూరంగా వాహనాలను ఆపి అవి వెళ్లే దాకా వెయిట్ చేశారు.

చాలామంది ఈ అద్భుత, అరుదైన దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వర్షాకాలంలో గిర్ ప్రాంతంలో సింహాలు తరచుగా రోడ్డుపై కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఒకేసారి 12 సింహాల గుంపు రోడ్డుపైకి రావడం చాలా అరుదైన సంఘటనగా అని అన్నారు.

ఇక వాహనాలు అక్కడే ఆగిపోవడంతో కాసేపు రోడ్డుపైనే గడిపిన సింహాలు తర్వాత తిరిగి అడవి వైపు వెళ్లిపోయాయి. దీంతో వాహనదారులకు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఘటనలో ఎలాంటి ప్రమాదం గానీ, ప్రాణనష్టం గానీ జరగలేదని.. సింహాలు ఎవరిపై ఎలాంటి దాడి చేయలేదని అధికారులు తెలిపారు. మొత్తానికి వాహనదారులకు జీవితంలో మర్చిపోలేని ఓ దృశ్యం కనిపించిందని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Comment