Bhanu Priya : ఆ స్టార్ హీరోతో పది సినిమాలు చేశాను.. ఎయిర్‏పోర్టులో నన్ను చూడగానే ఏమన్నారంటే.. భాను ప్రియ..


ప్రముఖ నటి భానుప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా, బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన అనూహ్య భేటీ, అన్నమయ్య చిత్రం తన జీవితంపై చూపిన ప్రభావం, అలాగే సుమన్, వంశీ వంటివారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. అన్నమయ్య సినిమా తనకు చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని భానుప్రియ తెలిపారు. ఈ చిత్రం విడుదలైన ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత తన వివాహం జరిగిందని, ఇది తన జీవితంలో ఒక గొప్ప మలుపు అని ఆమె పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల మంచి జీవిత భాగస్వామి, కుటుంబం దొరికాయని భానుప్రియ సంతోషంగా చెప్పారు. చిన్నప్పటి నుంచే వెంకటేశ్వర స్వామి అంటే తనకు, తన కుటుంబానికి ఎంతో భక్తి అని, పరీక్షలు పాస్ అయితే తిరుపతికి వెళ్లి గుండు చేయించుకునేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా నటించిన వారికి, సాంకేతిక నిపుణులకు కూడా అనేక అద్భుతాలు జరిగాయని చాలామంది చెప్పినట్లు భానుప్రియ ప్రస్తావించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

తన సినీ ప్రస్థానంలో ఎంతోమంది ముఖ్యమైన వ్యక్తులతో కలిసి పనిచేశానని భానుప్రియ వివరించారు. బాలకృష్ణ గారితో దాదాపు ఎనిమిది నుంచి పది చిత్రాలలో నటించానని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆయన చాలా ఉత్సాహంగా, సరదాగా ఉంటారని చెప్పారు. చాలా కాలం తర్వాత ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో బాలకృష్ణ గారిని కలిసినట్లు భానుప్రియ తెలిపారు. బాలకృష్ణ తనను చూడగానే పలకరించి, చాలా బాగా మాట్లాడారని, “ఎలా ఉన్నావ్, ఏంటి?” అని ఆప్యాయంగా అడిగారని ఆమె చెప్పారు. తన భర్త గురించి కూడా ఆరా తీశారని, “హైదరాబాద్ ఎప్పుడైనా వస్తే ఇంటికి రా” అని ఫోన్ నంబర్ కూడా ఇచ్చారని భానుప్రియ తెలిపారు. బాలకృష్ణ అంటే తన తల్లికి కూడా ఎంతో ఇష్టమని ఆమె పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

సుమన్ గారితో సుమారు 14 నుంచి 15 చిత్రాలు చేశానని భానుప్రియ వెల్లడించారు. ఆయన చాలా సౌమ్యంగా, మంచి మనిషిగా ఉంటారని వివరించారు. ఇటీవల దమ్ము చిత్రంలో సుమన్ గారితో కలిసి నటించినట్లు, దుర్గా నవరాత్రి సమయంలో ఆయన తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశం పంపించారని భానుప్రియ పేర్కొన్నారు. దర్శకుడు వంశీ తన కెరీర్‌కు ఒక గొప్ప బ్రేక్ ఇచ్చారని, సితార, అన్వేషణ వంటి చిత్రాలలో మంచి పాత్రలు లభించాయని ఆమె గుర్తుచేసుకున్నారు. వంశీతో పెళ్లి సంబంధం గురించి గతంలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, అప్పుడు వంశీ వివాహితుడు కావడంతో తన తల్లి ఒప్పుకోలేదని భానుప్రియ స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

భానుప్రియ, బాలకృష్ణ..

Bhanupriya, Balakrishna

Bhanupriya, Balakrishna

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..



Source link

Leave a Comment