Allu Arjun: అల్లు అర్జున్‏తో మరోసారి ఆ క్రేజీ హీరోయిన్.. రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..


స్టైలీష్ స్టా్ర్ అల్లు అర్జున్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. పుష్ప 1, 2 చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న బన్నీ.. ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జవాన్ తర్వాత అట్లీ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అయితే చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదెలా ఉంటే.. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రష్మిక సైతం కనిపించనుందని ముందు నుంచి టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మైసా సినిమా షూటింగ్ సమయంలో రష్మికకు గాయమైంది. దీంతో నెల రోజులుగా విశ్రాంతి తీసుకుంటుడంతో ఆమె అప్ కమింగ్ సినిమాలు తాత్కాలికంగా షూటింగ్ నిలిచిపోయాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

ఇక ఇప్పుడిప్పుడే రష్మిక కోలుకుని తన ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటిస్తున్న రాకా చిత్రీకరణలోనూ రష్మిక పాల్గొంటుందని టాక్. ఇందులో రష్మికతోపాటు మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కూడా కనిపించనున్నారట. రష్మిక, అల్లు అర్జున్, ఐశ్వర్య లక్ష్మి కాంబోలో రాబోయే సీన్స్ సెప్టెంబర్ లో చిత్రీకరించనున్నారట. వచ్చే నెలలో ఒక భారీ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ ఇప్పుడు సన్నద్ధమవుతుందట.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

రాకా చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఒకటి దైవిక యోధుడి పాత్ర, మరొకటి ప్రతికూల లక్షణాలున్న పాత్ర, ఇక మూడవది ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఈ పాత్ర మూడు వేర్వేరు కాలాల్లో, విభిన్న అవతారాలలో కనిపిస్తుంది. తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసుకున్న దీపికా పడుకోన్, పౌరాణిక వేద కాలంలోని గర్భిణీ స్త్రీ పాత్రలో నటిస్తున్నారు. దీపిక ప్రాణాల కోసం చేసే పోరాటంలో కీలక పాత్ర పోషించే ఆమె రక్షకురాలి పాత్రలో రష్మిక నటిస్తుండగా, జాన్వీ కపూర్ ఒక గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

సెప్టెంబర్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు, అక్కడ చిత్ర నిర్మాతలు అర్జున్‌తో విస్తృతమైన యాక్షన్ సన్నివేశాలున్న ఇంటర్వెల్ బ్లాక్‌ను చిత్రీకరిస్తారని సమాచారం. ‘కింగ్’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత, షారుఖ్ ఖాన్ సెప్టెంబర్‌లో ‘రాకా’లో తన అతిథి పాత్రలో నటిస్తాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంతో తెలియాల్సి ఉంది.

రష్మిక మందన్నా పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..





Source link

Leave a Comment