నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. రాష్ట్రానికి ఏం చేయగలనో గైడ్ చేయండి : అనంత్ అంబానీ


నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. రాష్ట్రానికి ఏం చేయగలనో గైడ్ చేయండి : అనంత్ అంబానీ

ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రారంభోత్సవ సభలో పాల్గొనేందుకు వచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ISAలో రిలయన్స్‌ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్న అనంత్ అంబానీ తనను ఆంధ్ర బిడ్డగా చూడాలని కోరారు. రాష్ట్రానికి తానేం చేయగలనో గైడ్ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు.

అదే సమయంలో దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఆంధ్రా అభివృద్ధిలో భాగస్వామి అవుతున్న అనంత్ అంబానీ ఆంధ్రా బిడ్డేనన్నారు. అనంత్‌ కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాద.. ఆయనో గొప్ప పర్యావరణ పరిరక్షకుడన్నారు. జామ్‌ నగర్‌లో 3,500 ఎకరాల్లో జంతువుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. రాయలసీమలో ఐఎస్‌ఏ ఏర్పాటుకు ఆయన ముందుకు రావడం చాలా సంతోషమన్నారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. తాను ఆంధ్రా కోడలిని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Comment