SRH vs RR IPL 2026 Result: బుడ్డోడి ఎఫెక్ట్.. హైదరాబాద్ ఘోర పరాజయం.. క్వాలిఫైయర్ 2కి రాజస్థాన్ | Sunrisers Hyderabad vs Rajasthan Royals, Eliminator IPL Match Result 2026 Know Who Won SRH vs RR Match on 27 05 2026 Highlights in Telugu


Sunrisers Hyderabad vs Rajasthan Royals, Eliminator Result, IPL 2026: ఐపీఎల్ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఘోరంగా విఫలమైంది. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆరెంజ్ ఆర్మీ ఆలౌట్ అయ్యింది. దీంతో రాజస్థాన్ క్వాలిఫైయర్ 2కి చేరింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో తదుపరి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అవుటయ్యారు. పాట్ కమిన్స్‌ను సుశాంత్ మిశ్రా, నితీష్ రెడ్డిని రవీంద్ర జడేజా, స్మారక్ రవిచంద్రన్‌ను నాండ్రే బర్గర్, హెన్రిచ్ క్లాసెన్‌ను యశ్ పుంజా పెవిలియన్ చేర్చారు.

సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు .. గేమ్ మార్చిన బుడ్డోడు..

వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 334.48 స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు సాధించాడు. అతను ఈ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు. క్రిస్ గేల్ 14 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా కూడా వైభవ్ నిలిచాడు. గేల్ 2012లో 59 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఈ సీజన్‌లో ఇప్పటికే 65 సిక్సర్లు బాదాడు.

ముగిసిన సన్‌రైజర్స్ ప్రయాణం..

ఈ ఓటమితో 2026 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి తదుపరి దశకు వెళ్లాలనుకున్న అభిమానుల ఆశలపై రాజస్థాన్ రాయల్స్ నీళ్లు చల్లింది. ఈ విజయం రాజస్థాన్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపగా, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ తమ వైఫల్యాలపై సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొత్తానికి, ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ సర్వశక్తులూ ఒడ్డి పోరాడి విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ పోరాడినప్పటికీ భారీ లక్ష్యం ముందు తలవంచక తప్పలేదు. రాజస్థాన్ రాయల్స్ తదుపరి పోరులో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి.



Source link

Leave a Comment