Vijay Deverakonda – Rashmika Mandanna : ఇట్స్ అఫీషియల్.. మా పెళ్లి వేడుకకు ఇదే పేరు.. విజయ్, రష్మిక అధికారిక ప్రకటన..


టాలీవుడ్ స్టా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా పెళ్లి చేసుకోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. అయితే మొదటి సారి తమ పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు విజయ్, రష్మిక. వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీరిద్దరు తొలిసారి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. అభిమానులు పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహ వేడుకకు ‘విరోష్‌’ (Wedding of VIROSH)గా పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

‘‘మేం ఏవైనా ప్లాన్స్‌ చేసుకుందామనుకున్నా, మా కోసం ఏదైనా ఎంపిక చేసుకున్నా ముందుగా మీరే అక్కడ ఉంటూ ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో మాు ఒక పేరు పెట్టారు. మమ్మల్ని ‘విరోష్’ అని పిలుస్తున్నారు. అందువల్ల ఈరోజు హృదయపూర్వకంగా అభిమానుల గౌరవార్థం అదే పేరును మేము స్వాగతిస్తున్నాం. మా పెళ్లి వేడుకకు ‘వెడ్డింగ్‌ ఆఫ్‌ విరోష్‌’ అని పేరు పెట్టాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇంత ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరెప్పుడూ మాలో ఒక భాగం. ప్రేమాభిమానాలతో..’’ -ఇన్‌స్టాలో విజయ్‌ దేవరకొండ, రష్మికే పోస్ట్‌ పెట్టారు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..





Source link

Leave a Comment