ఈ జోడీ ఒకేసారి వయలెంట్ లుక్స్‌తో రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక అయితే తన పోస్ట్‌లో “ఇది కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది” అంటూ హింట్ ఇచ్చింది. ఒకప్పుడు లవ్ స్టోరీలతో సాఫ్ట్‌గా కనిపించిన వీరు, ఇప్పుడు ఇలా ఊర మాస్ అవతారాలు ఎత్తడం చూస్తుంటే థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు వేరే లెవల్లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. రవికిరణ్ కోలా దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది. సినిమా టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో విజయ్ కనిపించారు. 80ల్లో జరిగే కథ కావడంతో నాటి ప్రపంచాన్ని టెక్నీషియన్స్ అద్భుతంగా తీర్చిదిద్దారని మేకర్స్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో