భోపాల్ వేదికగా రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్ చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ట్రోల్ చేసేవారు పనిలేకుండా ఇతరులను కించపరిచేందుకు చూస్తారని, వారు గుంటకాడ నక్కల వంటివారని జగపతి బాబు అభివర్ణించారు. ఒక సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగానో కష్టపడ్డారని, ఎన్నో గాయాలయ్యాయని, ఆయన అంకితభావాన్ని ట్రోలర్స్ విస్మరిస్తున్నారని జగపతి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ సమయంలో ఒక హీరోపై డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, థియేటర్ ఇష్యూస్ వంటి అపారమైన ఒత్తిడి ఉంటుందని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం :
పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?
సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం
బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు!