దాదాపు ఈ లోయలో 500 కంటే ఎక్కువ జాతుల పూలు వికసిస్తాయి. గులాబీ, ఊదా , నీలం , తెలుపు, పసుపు రంగు పూలతో ఈ లోయ మొత్తం నిండిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ సమయంలో హిమాలయన్ బ్లూ పాపీ, బ్రహ్మ కమలం, ఇలా అనేక రకాల పూలు ఈ సమయంలో వికసించి, లోయ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది.