బుచ్చి బాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన లాంటి హిట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన బుచ్చిబాబు.. ఆతర్వాత ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారాడు. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ కథను చూపిస్తూనే అద్భుతమైన ఎమోషన్ ను కూడా చక్కగా తీర్చిదిద్దాడు బుచ్చిబాబు. దాంతో తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు రూ. 100కోట్లు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..
ఇవి కూడా చదవండి
ఇక ఉప్పెన సినిమా ద్వారానే యంగ్ బ్యూటీ కృతిశెట్టి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఆయన తెలుగులో ఫుల్ లెన్త్ ఉన్న పాత్ర చేసిన మొదటి సినిమా ఇదే.. అంతకు ముందు సైరాలో కనిపించారు. కాగా ఈ పాత్ర కోసం ముందుగా మరో హీరోను అనుకున్నాడట బుచ్చిబాబు. ఆయన ఎవరో కాదు జగపతి బాబు. విషయాన్నీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు జగ్గూ భాయ్.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..
జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకరోజు దర్శకుడు బుచ్చిబాబు నాకు ఫోన్ చేసి, ఒక మంచి కథ ఉంది, మీ పాత్ర అద్భుతంగా ఉంటుంది.. మీకు చెప్పడానికి వస్తున్నాను అన్నాడు. నేను సరే రమ్మని చెప్పి ఎదురుచూశా.. కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీ ఇంటి గేట్ దగ్గరే ఉన్నాను, లోపలికి వస్తున్నాను అన్నాడు. సరే లోపలి వచ్చేయ్ అన్నాను.. అంతలోనే సడన్‌గా మళ్ళీ ఫోన్ చేసి.. ‘సార్, క్షమించండి.. హీరో(వైష్ణవ్ తేజ్)తో ర్జెంట్ పని పడింది, నేను వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. అంతే ఆతర్వాత తిరిగి రాలేదు. అతను మైండ్ లో ఆ పాత్రను మార్చుకొని, దానికి విజయ్ సేతుపతి సరిపోతాడని అనుకున్నాడేమో.. అది విజయ్ సేతుపతితో చేశాడు.. ఆ టైం లో మంచి దర్శకుడిని మిస్ అయ్యాను అని కాస్త బాధపడ్డాను అని జగపతిబాబు తెలిపారు. ప్రస్తుతం పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు జగపతిబాబు.
ఇది కూడా చదవండి : 15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!
జగపతిబాబు ఇన్ స్టాగ్రామ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి