మీరు ఉగ్రవాది.. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో మహమ్మద్‌ యూనస్‌కు నిరసన సెగ..!


మీరు ఉగ్రవాది.. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో మహమ్మద్‌ యూనస్‌కు నిరసన సెగ..!

అక్టోబర్‌ 12, సోమవారం దోహా నుంచి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో యూనస్‌ న్యూయార్క్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు బంగ్లాదేశీ ప్రవాసులు ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నించారు. ‘మీరు ఉగ్రవాది. బంగ్లాదేశ్‌లో ప్రజలను చంపారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారో చెప్పండి’ అంటూ ఓ వ్యక్తి యూనస్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచారనీ, రెండు లక్షల మందిని అరెస్టు చేశారని, వేలాది మంది పోలీసు సిబ్బంది మరణాలకు బాధ్యత వహించాలనీ ఆ వ్యక్తి డిమాండ్‌ చేసాడు. జెఎఫ్‌కె విమానాశ్రయంలోని టెర్మినల్‌ 8 నుంచి యూనస్ వీల్‌చైర్‌ లో వెళ్తుండగా కొందరు దగ్గరికొచ్చి నినాదాలు చేసారు. భద్రతా సిబ్బంది యూనస్‌ ను అక్కడ్నుంచి తీసుకెళ్లారు.

2024లో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలు

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం 2024 ఆగస్టు 5న భారీ ప్రజా ఉద్యమం నేపథ్యంలో కూలిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఆగస్టు 8, 2024న మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు, వివాదాలు కొనసాగాయి. తాజాగా న్యూయార్క్‌ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన మరోసారి బంగ్లాదేశ్‌ రాజకీయ పరిణామాలపై చర్చకు దారితీసింది.

కాగా, మహమ్మద్‌ యూనస్‌పై జరిగిన వేధింపులను తాజాగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఖండించింది.  ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యూయార్క్  పోలీసు అధికారులతో కలిసి పనిచేయాలని అక్కడి బంగ్లాదేశ్‌ దౌత్య కార్యాలయాన్ని ఆదేశించింది.  నిషేధిత అవామీ లీగ్‌తో సంబంధాలు ఉన్న ఓ బృందం, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత యూనస్‌పై జరిగిన ఈ ఘటన వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటన అంతర్జాతీయ సమాజం దృష్టిలో బంగ్లాదేశ్‌తో పాటు ఆ దేశ పౌరుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని కూడా తెలిపింది



Source link

Leave a Comment