నిఫ్టీ సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఆధారంగా ఈ ఐసీఐసీఐ ఫండ్ పనితీరు ఉంటుంది. ఆ ఇండెక్స్‌లో ఉండే సూచీల పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లకు రాబడి వస్తుంది. ఈ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులను ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలిక మూలదన వృద్దిని అందించాలనే లక్ష్యంతో ఈ ఫండ్‌ను ఐసీఐసీఐ కొత్తగా తీసుకొచ్చింది.