కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇటీవల మార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నటులు ఇతర భాషల్లోని చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించడంపై సుదీప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఈగ, బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలతో సుపరిచితుడైన సుదీప్, ఆ తర్వాత ఇతర భాషా చిత్రాల్లో కనిపించడం మానేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉండటం వల్లే సుదీప్ ఇతర భాషల సినిమాలకు దూరంగా ఉన్నారని అభిమానులు భావించారు. అయితే, తన తాజా వ్యాఖ్యలతో అందుకు భిన్నమైన కారణం ఉందని సుదీప్ పరోక్షంగా సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :