Actress : పుట్టుకతోనే గుండె జబ్బు.. అయినా ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. స్టార్ హీరోలకే పిచ్చెక్కించేసింది.. – Telugu News | Actress Madhubala Once Rejected Hollywood Offer, She Struggled heart Problem


భారతీయ సినిమా ప్రపంచంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పటికీ చెరగని ముద్ర వేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. పుట్టుకతోనే గుండె జబ్బు.. నిత్యం అనారోగ్యంతో పోరాటం.. అయినా అగ్ర కథానాయికాగ ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? ఆమె పేరు మధుబాల. ఫిబ్రవరి 14, 1933న ఢిల్లీలో జన్మించింది. ఆమె అసలు పేరు ముంతాజ్ జహాన్ దెహ్లవి. చిన్నప్పటి నుంచి ఆమె ముఖంలోని అమాయకత్వం, అందం కారణంగా అందరి దృష్టిని ఆకర్షించేది. అందుకే చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. కేవలం 9 సంవత్సరాల వయసులో ఆమె ‘బసంత్’ చిత్రంలో బాలనటిగా తెరంగేట్రం చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ఆ తర్వాత ఆమె కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నెమ్మదిగా హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె అందం, సహజ నటన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. అదే సమయంలో ఆమెకు ఆస్కార్ అవార్డు గ్రహీత దర్శకుడు ఫ్రాంక్ కాప్రా మెరికాలో భారీ బడ్జెట్ చిత్రాలలో పనిచేయమని ఆఫర్ చేశాడు. ఆ సమయంలో, ఒక భారతీయ నటికి హాలీవుడ్‌లో పనిచేసే అవకాశం లభించడం చాలా పెద్ద విషయం. కానీ ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. తనకు విజయం అంటే డబ్బు, కీర్తి మాత్రమే కాదని, తన కుటుంబం, విలువలకు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

దాదాపు 22 సంవత్సరాల కెరీర్‌లో, మధుబాల 70 చిత్రాలలో నటించారు. వీటిలో చాలా చిత్రాలు ఆమెకు పరిశ్రమలో ‘అందాల దేవత’ అనే బిరుదును సంపాదించిపెట్టాయి. ‘మొఘల్-ఎ-ఆజం’లో ఆమె పోషించిన అనార్కలి పాత్ర నేటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినీ ప్రయాణం ఎంత విజయవంతగా సాగినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం అంత సాఫీగా సాగలేదు. పుట్టుకతోనే ఆమె గుండె జబ్బుతో బాధపడింది. ‘మొఘల్-ఎ-ఆజం’ చిత్రీకరణ సమయంలో కూడా ఆమె గుండె జబ్బుతో పోరాడుతోంది. ఆమె ఫిబ్రవరి 23, 1969న కేవలం 36 సంవత్సరాల వయసులో మరణించింది. ఇప్పటికీ ఆమె రూపం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని రూపం.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Madhubala Movies

Madhubala Movies

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..



Source link

Leave a Comment