Chiranjeevi: తెలంగాణ ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్ కలను నిజం చేసిన చిరంజీవి.. గిఫ్ట్‌ ఏమిచ్చారో తెలుసా? వీడియో


తెలంగాణ ఈఏపీసెట్ లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఎం. రుషి కలను నిజం చేశారు చిరంజీవి. పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ‘ఈఏపీసెట్లో స్టేట్ టాప్ ర్యాంక్ వస్తే మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి ఆమెకు గతంలో మాట ఇచ్చారు. దీంతో ఆమె అహర్నిశలు శ్రమించి టాపర్ గా నిలిచింది. అలా ఆ తండ్రి తన కూతురికి ఇచ్చిన ప్రామిస్ ను చిరంజీవి నెరవేర్చారు. రుషి సాధించిన అద్భుత విజయానికి ముగ్ధుడైన చిరంజీవి, ఆ విద్యార్థినితో పాటు ఆమె కుటుంబ సభ్యులను స్వయంగా తన ఇంటికి పిలిపించుకున్నారు. విద్యార్థినిని అభినందించి శాలువాతో సత్కరించారు. అంతేకాదు ఆమె ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్ టాప్ ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో రుషి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు చిరంజీవి.


ఇవి కూడా చదవండి

ఇక తన అభిమాన హీరోను కలవడమే కాకుండా ఆయన చేతుల మీదుగా సత్కారం అందుకున్న రుషి  ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని సదరు విద్యార్థిని తెగ సంబరపడిపోతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, ఈఏపీసెట్ టాపర్ రుషిని సత్కరిస్తున్నఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ బాగా అవుతున్నాయి. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడంలో చిరంజీవి చూపించిన చొరవపై నెటిజన్లు ప్రశంసల వరం కురిపిస్తున్నారు.

వీడియో ఇదిగో..

చిరంజీవితో ఈఏపీసెట్ టాపర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Comment