ఇతర సినిమాలతో పోల్చుకుంటే హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందులోనూ ఓటీటీలో అయితే ఈ జానర్ సినిమాలకు ఓ రేంజ్ లో ఆదరణ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం క్రమం తప్పకుండా వివిధ భాషల్లో హిట్ అయినా హారర్ థ్రిల్లర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అది కూడా ఆయా భాషల్లోకి డబ్బింగ్ చేసి మరీ ఓటీటీల్లోకి అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. హారర్, మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. రిలీజ్ సమయంలో ఈ సినిమాకు ఐఎమ్ డీబీ టాప్ రేటింగ్ వచ్చింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ధీరన్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. గతంలో అను అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మనస్పర్థలతో ఇద్దరూ విడిపోతారు. అయితే ఒకరోజు చెన్నైకి రమ్మని ధీరన్ ను ఆహ్వనిస్తుంది అను.
సిటీకి వచ్చిన అతను ఓ అపార్ట్ మెంట్ లోని ఫోర్త్ ఫ్లోర్ లోని ఓ ఫ్లాట్ లో దిగుతాడు. అయితే అక్కడకు వచ్చినప్పటి నుంచే ధీరన్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అతణ్ని ఎవరో ఫోర్త్ ఫ్లోర్ నుంచి తోసేసినట్లు, ఓ శక్తి వెంబడిస్తున్నట్లు కలలు వస్తాయి. మరోవైపు ఫ్లాట్ వెంటనే ఖాళీ చేయాలని అపార్ట్ మెంట్ వాళ్లు ధీరజ్ ను ఫోర్స్ చేస్తుంటారు.
మరి ధీరజ్ దిగిన ఆ ఫోర్త్ ఫ్లోర్ లో అసలు ఏముంది? అను ఏమైంది? అనుతో ఉన్న చిన్న పాప ఎవరు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కథకు తగ్గట్టుగానే సాగే ఈ సినిమా పేరు ఫోర్త్ ఫ్లోర్. డైరెక్టర్ ఎల్ ఆర్ సుందరపాండి తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ బిగ్ బాస్ ఫేమ్ అరి అర్జునన్, దీప్సిక, పవిత్ర, అలాగే తలైవాసల్ విజయ్, సుబ్రమణియన్ శివ, ఆదిత్య కథిర్,బేబీ శ్రీవర్షిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అలాగే ఆహా తమిళ్, సింప్లీ సౌత్, టెంట్ కోటా ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి ‘ఫోర్త్ ఫ్లోర్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఫోర్త్ ఫ్లోర్ సినిమా ట్రైలర్..
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి