OTT Movie: ప్రేమ పేరుతో అమ్మాయి మోసం.. సైకో కిల్లర్‌గా మారే డెంటిస్ట్.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ వేరే లెవెల్


ప్రస్తుతం సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలను చూసేస్తుంటారు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఇందులో కామ్ గా ఉండే ఒక డెంటిస్ట్ అమ్మాయి వలలో పడతాడు. అయితే ఆ అమ్మాయి మోసం చేయడంతో సైకో గా మారిపోతాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఓ డెంటిస్ట్ చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ ఫ్రెడ్డీ జిన్వాలా చాలా కామ్ గా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. డెంటిస్ట్ గా తన పనేంటో తాను తాను చూసుకుంటాడు. ఒంటరిగా బతికే అతనికి స్నేహితులు కానీ, గర్ల్‌ఫ్రెండ్ కానీ ఎవరూ ఉండరు. అలాంటి సమయంలో ఫ్రెడ్డీ క్లినిక్‌కి కాయనాజ్ ఇరానీ అనే వివాహిత ట్రీట్మెంట్ కోసం వస్తుంది. ఆమెను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు ఫ్రెడ్డి . మరోవైపు కాయనాజ్ తన భర్త రుస్తమ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అతనితో కలిసి ఉండలేనని ఫ్రెడ్డీకి చెబుతుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకుంటే ఇద్దరం కలసి బతకొచ్చని కాయనాజ్ ఫ్రెడ్డీకి సలహా ఇస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి రుస్తమ్ ను హత్య చేయడానికి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్లే అతనిని చంపేస్తారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కాయనాజ్ అసలు ఫ్రెడ్డిని ప్రేమించలేదని, కేవలం తన భర్తను అంతమొందించడానికి ఆమె ఒక పావులా వాడుకుందని తెలుసుకుంటాడు ఫ్రెడ్డీ. ఆమెకు ముందే వేరే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, ఈ హత్య కేసులో తనను బలిపశువును చేసేందుఉక ఇలా చేసిందని తెలుసుకుంటాడు. మరి ఆ తర్వాత డెంటిస్ట్ ఫ్రెడ్డీ ఏం చేశాడు? తనను మోసం చేసిన కాయనాజ్ అండ్ గ్యాంగ్‌పై అతను ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఓటీటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ గా నిలిచే ఈ సినిమా పేరు ఫ్రెడ్డీ (Freddy). బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో కార్తీక్ ఆర్యన్ ఇందులో సైకో డెంటిస్ట్ గా నటించడం విశేషం. ఎక్కువగా లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలతో మెప్పించే కార్తీక్.. ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా భిన్నమైన గ్రే షేడ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చాడు. శశాంక్ ఘోష్ తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తీక్ ను మోసం చేసే అమ్మాయి పాత్రలో అలయా ఎఫ్ నటించింది. బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనాలు, ఉత్కంఠభరితమైన సీన్లు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమాకు ఐఎండీబీలోనూ ఏకంగా 7.3 రేటింగ్ దక్కడం విశేషం. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఆస్వాదించవచ్చు.

ఫ్రెడ్డీ సినిమా ట్రైలర్..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Comment