ట్రోలింగ్..! సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. కనిపించేది ఇదే! అయితే ఇక్కడ సాడ్ రియాల్టీ ఏంటంటే… చాలా మంది నెటిజన్లు దీన్ని ఎంటర్టైన్మెంట్గానే చూస్తున్నారు. ఓ సెలబ్రిటీ పై జరిగే ట్రోలింగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. షేర్ చేస్తున్నారు. అదే ట్రోలింగ్ కు గురైన సెలబ్రిటీ మాత్రం.. తెలియని భయంలోకి జారుకుంటున్నారు. ఇప్పుడు రష్మిక మందన కూడా… ట్రోలింగ్ భయానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎట్ ప్రజెంట్ బాలీవుడ్ కాక్ టెయిల్ 2 సినిమా చేసిన రష్మిక మందన.. ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉంది. ఈక్రమంలోనే తన సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు ఓ ఇంటర్వ్యూకు వెళ్లింది. అక్కడ ట్రోలింగ్ భయంతో తాను ఏం మాట్లాడలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయింది. ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది..మనం ఏం మాట్లాడినా.. అది వేరే విధంగా వెళ్తుంది. తాను అనని విషయాలను కూడా అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. మన గురించి ఎలాంటి రూమర్ వస్తుందో అని రోజూ భయంతో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా మంచిదే కానీ దాన్ని కొందరు తప్పుగా వాడుతున్నారు అని అంటూ రష్మిక మందన ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రోలింగ్ సెలబ్రిటీలను ఎలా బాధిస్తుందనేది అందరికీ తెలిసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?
ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!
అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!
కీర దోసకాయ వీరికి విషంతో సమానం!
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్’తో మతిమరుపు మాయం