RRB ALP Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే – Telugu News | RRB ALP Vacancy 2026 27 Announced, 11,127 Assistant Loco Pilot Posts Approved


భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వివిధ రైల్వే జోన్లలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి రైల్వే శాఖ త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టుల భర్తీ రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. మొత్తం పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో 674 ఉద్యోగాలు ఉన్నట్లు వెల్లడించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితో పాటు ఐటీఐ (ITI) లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అందిన సమాచారం మేరకు ఆర్ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్‌ ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..

ఆర్ఆర్‌బీ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు CBT 1, CBT 2, CBAT పరీక్షల్లో దశల వారీగా ఉత్తీర్ణత పొందవల్సి ఉంటుంది. ఒక దశలో కనీస అర్హత మార్కులు పొందిన వారిని మాత్రమే రెండో దశ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మూడు దశల్లో ప్రతిభ కనబరచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Comment