Sara Arjun: ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ తండ్రి తెలుగులో స్టార్ నటుడని తెలుసా? విజయ్ దేవరకొండ, రష్మికలతో సినిమాలు


Sara Arjun: ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ తండ్రి తెలుగులో స్టార్ నటుడని తెలుసా? విజయ్ దేవరకొండ, రష్మికలతో సినిమాలు

‘నాన్న’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి చిన్నప్పుడే ఫేమస్ అయిపోయింది సారా అర్జున్. ఆ తర్వాత మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి రోల్ లోనూ ఎంతో అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక గతేడాది డిసెంబర్ లో రిలీజైన ‘ధురంధర్‌’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది సారా అర్జున్. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతోనూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీని తర్వాత గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియాలోనూ ఒక కీలక పాత్రలో కనిపించింది సారా. ఇక ఇప్పుడు ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) సినిమాతో మరోసారి ఈ అమ్మడి పేరు మార్మోగుతోంది. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.

అదేంటంటే.. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ కూడా ప్రముఖ నటుడే. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లోనూ నటించారాయన. ముఖ్యంగా పలు తెలుగు సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేశాడు రాజ్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్‌ మూవీలో క్రికెట్ సెలక్టర్‌ రమేశ్‌ రావు పాత్రలో నటించారు రాజ్. అలాగే ఆనంద్ దేవరకొండ గం గం గణేశాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసిన ఆయన అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రజాకార్ మూవీలో కరుడు గట్టిన నిజాం ప్రభువు ఖాసీం రజ్వీ పాత్రలో అద్భుతంగా నటించారు. వీటితో పాటు అంజలి, చాందీని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ లో క్యాలెబ్ అనే డిఫరెంట్ రోల్ లో మెరిశారు అర్జున్ రాజ్.

తండ్రి అర్జున్ రాజ్ తో ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్..

 

View this post on Instagram

 

A post shared by Raj Arjun (@rajarjunofficial)

2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్‌ ఇప్పటివరకు దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. ఆమిర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్‌స్టార్ అనే చిత్రంతో బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో సహాయక నటుడిగా చేస్తున్నారు రాజ్ అర్జున్.

చిన్నప్పుడు తండ్రితో సారా అర్జున్..

 

View this post on Instagram

 

A post shared by Raj Arjun (@rajarjunofficial)

 

View this post on Instagram

 

A post shared by Sara Arjun (@saraarjunn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Comment