మేషం: ఈ రాశివారికి ధన, కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల మహిళలకు విశేషంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడుల ద్వారానే కాక జీతభత్యాలపరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది.
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశిలోనే సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి అరుదైన మాలవ్య మహా పురుష యోగం పట్టబోతోంది. దీనివల్ల వీరికి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతాన యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.
కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశి మహిళలకు అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థినులు విజయాలు సాధిస్తారు. కుటుంబ, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల పేరు ప్రతిష్ఠలు, పలుకుబడి బాగా వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖురాలిగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో రికార్డులు సృష్టిస్తారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. నిరుద్యోగ మహిళలకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపగితి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజయోగాలతో పాటు ధనయోగాలు కూడా కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతితో పాటు, ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.
కుంభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల దిగ్బల రాజయోగంతోపాటు, మాలవ్య మహా పురుష యోగం కూడా పడుతోంది. దీనివల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం కూడా పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఈ రాశి స్త్రీలకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. ఊహించని స్థాయిలో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.





