రాత్రంతా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకముందు ఉన్న ఫోన్లు అయతే పాడై పోయేవి. కానీ ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు చాలా స్మార్ట్‌గా ఉన్నాయి. మీ వద్ద ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఉంటే స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవ్వగానే.. ఫోన్‌లోని సాంకేతికత ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో మీ ఫోన్‌ను రాత్రంతా ప్లగ్ చేసి ఉంచినా కూడా బ్యాటరీ పాడవదు. కానీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. దీంతో దిండు లేదా దుప్పటి కింద పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.