Vijayashanti: నేను లేకపోతే సినిమా చేయను అనేవారు.. ఆయన లేకపోతే నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..


ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. పారితోషికంతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, హీరో ఇమేజ్ తెచ్చుకోవడం చాలా కష్టమని నటి విజయశాంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఒక మహిళగా, హీరోలతో సమానంగా పారితోషికం, గౌరవం సంపాదించుకోవడం మామూలు విషయం కాదని ఆమె పేర్కొన్నారు. యాక్షన్ పాత్రల కోసం మానసికంగా సిద్ధపడటం, శారీరక శ్రమకు అలవాటు పడటం సులభం కాదని విజయశాంతి వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

యాక్షన్ సన్నివేశాల్లో నటించడం అలవాటు పడటానికి తనకు కొంత సమయం పట్టిందని, తన శరీరాకృతిని, నటన శైలిని ఒక రఫ్ అండ్ టఫ్ హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్చుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. మొదటి చిత్రం నుండి క్రమంగా తన ఫైట్స్ మెరుగుపరుచుకుంటూ వెళ్ళానని, అప్పట్లో గ్రాఫిక్స్ లేని కారణంగా ప్రతి సాహసాన్ని ఒరిజినల్‌గానే చేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. డూప్ లేకుండా 20-30 అడుగుల ఎత్తు నుండి దూకడం, గన్‌తో షూట్ చేయడం వంటి సన్నివేశాలను ఎంతో కష్టపడి చేశానని ఆమె వెల్లడించారు. ఈ ప్రయత్నాల ద్వారా తాను ఒక యాక్షన్ హీరోయిన్‌గా, హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా ఇలాంటి పాత్రలు చేయగలరని నిరూపించుకోగలిగానని విజయశాంతి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఈ ప్రయాణంలో దర్శకుడు టి.కృష్ణ (హీరో గోపిచంద్ తండ్రి ) పాత్ర ఎంతో కీలకమని విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. తనలోని నటనా సామర్థ్యాన్ని “నేటి భారతం” చిత్రం ద్వారా టి.కృష్ణ బయటకు తీసుకువచ్చారని, అప్పటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న తనను నటనపరంగా నిరూపించుకునే అవకాశం కల్పించారని ఆమె పేర్కొన్నారు. తను కేవలం గ్లామర్ హీరోయిన్ కాదని, నటించగల సామర్థ్యం ఉందని ప్రజలు గుర్తించడానికి టి.కృష్ణ గారే కారణమని ఆమె అన్నారు. విప్లవాత్మకమైన కథలకు, పాత్రలకు తాను సరిపోతానని టి.కృష్ణ గారు బలంగా నమ్మేవారని, తన రాసిన కథలకు విజయశాంతి న్యాయం చేయగలరని ఆయన భావించేవారని ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

అందుకే టి.కృష్ణ తన ప్రతి చిత్రంలోనూ విజయశాంతినే కథానాయికగా తీసుకునేవారని, ఒక సందర్భంలో అన్ని సినిమాల్లో తనే కనిపిస్తున్నానని, వేరొక హీరోయిన్‌ను తీసుకోమని అడిగినా కూడా, “శాంతమ్మ నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తావు” అని చెప్పేవారని విజయశాంతి పంచుకున్నారు. “ప్రతిఘటన” చిత్రం విషయానికి వస్తే, డేట్స్ కుదరక తాను చేయలేనని చెప్పినా, “నువ్వు చేయకపోతే నేను సినిమా తీయను” అని టి.కృష్ణ పట్టుబట్టారని, చివరికి ఇతర నిర్మాతలందరినీ ఒప్పించి ఒక నెల డేట్స్ తన కోసం కేటాయించారని ఆమె గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ఆ సినిమా పూర్తి చేశానని, ఆ సినిమాతోనే తనకు సూపర్‌స్టార్ అనే బిరుదు లభించిందని విజయశాంతి ఎంతో ఆనందంగా తెలిపారు. టి.కృష్ణ ప్రోత్సాహం, ఆయన విశ్వాసం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..



Source link

Leave a Comment