ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రపంచ వ్యక్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్పతో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశారు అల్లు అర్జున్.
‘పుష్ప: ది రైజ్’ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవాటిలో స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా” ఒకటి ఈ పాట సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్గా మారింది.
“పుష్ప: ది రైజ్” సినిమాలో సమంత “ఊ అంటావా మావా” అంటూ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రచించారు, ఇంద్రావతి చౌహాన్ దీనిని ఆలపించారు. ఈ పాటలో సమంత గ్లామరస్ లుక్, అమ్మడి డాన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్తో కనిపించింది సామ్.
అయితే ముందుగా ఈ సాంగ్ కోసం మరో హాట్ బ్యూటీని అనుకున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాతే చెప్పారు. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ కేతిక శర్మ. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ అనే సినిమాలో కేతిక స్పెషల్ సాంగ్ చేసింది.
గతంలో రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో చిత్రనిర్మాత రవి పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా కేతిక శర్మను అనుకున్నాం అని తెలిపారు. పుష్ప సాంగ్ చేసిఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరోలా ఉండేది అని నెటిజన్స్ అంటున్నారు.




