వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. థియేటర్ వేదికగా ప్రేక్షకులను మెప్పించిన బ్లాక్బస్టర్ హిట్ అనగనగా ఒక రాజు ఈ ఆదివారం, జూన్ 28, సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో! అనగనగా ఒక రాజు సినిమా భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు, ఆకట్టుకునే కథాంశంతో రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్గా అందరి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు చిన్నపెద్ద తేడా లేకుండా కుటుంబం అంతా కలిసి ఆనందించేలా టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా రావు రమేష్, తారక్ పొన్నప్ప, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). జమీందార్ మనవడు అనే పేరు తప్ప ఆస్తులేమీ మిగలకపోవడంతో రాజు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. ఎలాగైనా బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడిపోవచ్చని పలగటి కలలు కంటుంటాడు. ఇదే సమయంలో అతనికి చారులత (మీనాక్షి)ని చూస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే కష్టాల నుంచి బయటపడవచ్చని భావిస్తాడు. ఎలాగైనా ఆమె మనసుని గెలచుకోవాలని రంగంలోకి దిగుతాడు. మరి రాజు చారులత మనసుని గెల్చుకున్నాడా? ఆమె జీవితంలోకి వచ్చాక రాజు లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ రాజుగారి సినిమా చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
మారీ దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఐఎమ్డీబీలో ఈ సినిమాకు పదికి 6.2 రేటింగ్ ఉండడం విశేషం. మరి ఇన్ని విశేషాలున్న ఈ సినిమాని జీ తెలుగు వేదికగా ఆదివారం మీరూ తప్పకుండా చూసేయండి!
మరో రెండు రోజుల్లో టీవీలోకి వస్తోన్న అనగనగా ఒక రాజు..
2 Days to Go For Pure Entertainment
Watch World Television Premiere #AnaganagaOkaRaju This Sunday at 6 PM on #ZeeTelugu #ZeeTeluguSpotlight @NaveenPolishety @Meenakshiioffl @SitharaEnts @Fortune4Cinemas pic.twitter.com/QsfljSJ594
— ZEE TELUGU (@ZeeTVTelugu) June 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.