Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..! | Indian Railways: How to Get a Lower Berth in an Indian Train After Boarding


Indian Railways: భారతీయ రైల్వేలలో ప్రయాణించేటప్పుడు లోయర్ బెర్త్ పొందడం అనేది చాలా మంది ప్రయాణికులకు ఒక సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు. రైలు ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ కావాలంటే ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. అయితే, కొన్ని నియమాలను పాటిస్తూ, సరైన విధానంలో అడిగితే లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంది. అయితే మీరు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత మీకు లోయర్‌ బెర్త్‌ కాకుండా అప్పర్‌ బెర్త్‌, లేదా ఇతర బెర్త్‌లు వచ్చినట్లయితే మీరు లోయర్‌ బెర్త్‌కు కూడా మారవచ్చు. అందుకు కొన్ని రూల్స్‌ ఉన్నాయి. వాటిని పాటిస్తే సద్వినియోగం చేసుకోవచ్చు.

మీరు రైలు ఎక్కిన తర్వాత ముందుగా మీ రైలులో ఏ బోగీలో లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలి. దీని కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చార్ట్ వేకెన్సీ విభాగాన్ని తనిఖీ చేయాలి. అక్కడ మీ రైలు నంబరు, తేదీ, బోర్డింగ్ స్టేషన్ వివరాలను నమోదు చేస్తే, ఏ బోగీలో ఏ సీటు లేదా బెర్త్ ఖాళీగా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ జాబితాలో లోయర్ బెర్త్‌ను గుర్తించండి.

ఇది కూడా చదవండి: House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..!

ఇవి కూడా చదవండి



ఒకసారి ఖాళీ లోయర్ బెర్త్‌ను గుర్తించిన తర్వాత నేరుగా ఆ బెర్త్‌ను ఆక్రమించకూడదు. రైలులో ఉన్న టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)ని మర్యాదపూర్వకంగా సంప్రదించి, మీకు లోయర్ బెర్త్ అవసరాన్ని వివరించాలి. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో ఖాళీగా ఉన్న లోయర్ బెర్త్ గురించి కూడా టీటీఈకి చెప్పవచ్చు. టీటీఈ రైల్వే నియమాలు, ఇతర ప్రయాణికుల (ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్) అవసరాలు, తదుపరి స్టేషన్లలో ఎక్కే ప్రయాణికుల కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటారు. ఖాళీగా ఉన్న లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే టీటీఈ తన అధికారాన్ని ఉపయోగించి దానిని మీకు కేటాయించవచ్చు.

బెర్త్ మార్పిడి అనేది పూర్తిగా రైల్వే అధికారుల అభీష్టం మేరకు, సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. టీటీఈ అనుమతి లేకుండా ఏ ఖాళీ బెర్త్‌లోనూ కూర్చోవడం లేదా మారడం చేయకూడదు. ఈ విధానం అవగాహన కోసం మాత్రమే, తుది నిర్ణయం రైల్వే అధికారిక నిబంధనల ప్రకారం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Best Mileage Cars: రూ. 5 లక్షల బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్-5 బడ్జెట్ కార్లు!

ఇది కూడా చదవండి: Multibagger: రూ.71 స్టాక్ రూ.820కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ. 11.5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ షేర్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Comment