SRH vs CSK IPL 2026 Result: పోరాడి ఓడిన చెన్నై.. హైదరాబాద్ ఖాతాలో మూడో విక్టరీ.. – Telugu News | Sunrisers Hyderabad vs Chennai Super Kings IPL Match Result 2026 Know Who Won SRH vs CSK Match on 18 04 2026 Highlights in Telugu


Sunrisers Hyderabad vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అందించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

డెవాల్డ్ బ్రూయిస్ (0), సర్ఫరాజ్ ఖాన్ (25 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (19 పరుగులు), ఆయుష్ మహాత్రే (30 పరుగులు), సంజు సామ్సన్ (7 పరుగులు) దారుణంగా విఫలయ్యారు.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ (59), క్లాసెన్ (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా, మిగ‌తా ప్లేయర్లు విఫ‌లం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ 200 స్కోరును దాట‌లేక‌పోయింది. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో జేమి ఓవ‌ర్టన్, అన్షుల్ కంబోజ్ తలో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: సంజు శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Comment